News18th Jul 03:34 PMSunil Byrisetty1 min read

ఏపీలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ టూరిజం అభివృద్ధిపై కపిల్ దేవ్‌తో మంత్రి కందుల దుర్గేష్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి, తద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే అంశాలపై రాష్

ఏపీలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ టూరిజం అభివృద్ధిపై కపిల్ దేవ్‌తో మంత్రి కందుల దుర్గేష్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి, తద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నోయిడా (ఢిల్లీ)లో సుప్రసిద్ధ క్రికెట్, గోల్ఫ్ క్రీడాకారుడు, పీజీటీఐ (PGTI) అధ్యక్షుడు కపిల్ దేవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాలలో గోల్ఫ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను మంత్రి దుర్గేష్ .. కపిల్ దేవ్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాల్సిందిగా కపిల్ దేవ్‌ను మంత్రి దుర్గేష్ అధికారికంగా ఆహ్వానించారు.
Andhra Pradesh
Golf Tourism
Kandula Durgesh
Kapil Dev
Tourism
Visakhapatnam
అమరావతి
పీజీటీఐ
క్రీడా పర్యాటకం
ఏపీ టూరిజం
Scroll for the next article