News22nd Oct 11:22 AMSunil Byrisetty1 min read

భారత్ – ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర

బ్రిస్బేన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనర

భారత్ – ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర
బ్రిస్బేన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ ఎం.భాగోటియా ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు. వచ్చేనెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ – 2025కి హాజరై ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తెలుసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Nara Lokesh
India Australia Trade
Business Round Table
Brisbane
AIBC
పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025
విశాఖపట్నం
పారిశ్రామిక విధానం
ఎగుమతులు
వాణిజ్య సంబంధాలు
Scroll for the next article