Politics19th Oct 04:57 PMSunil Byrisetty1 min read

మచిలీపట్నం అభివృద్ధి నిరోధకుడు పేర్ని నాని

మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని మాజీ మంత్రి పేర్ని నాని కడుపు ఉబ్బరంతో మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్ర

మచిలీపట్నం అభివృద్ధి నిరోధకుడు పేర్ని నాని
మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని మాజీ మంత్రి పేర్ని నాని కడుపు ఉబ్బరంతో మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన నిరాధార ఆరోపణలను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి వెంకట స్వామి, పిప్పళ్ల కాంతారావు తిప్పికొట్టారు. పేర్ని నాని అనే వ్యక్తి అభివృద్ధి నిరోధకుడు అని, మచిలీపట్నం అభివృద్ధిని చూసి తట్టుకోలేని వ్యక్తి అని విమర్శించారు. 2011లో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల విస్తరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారన్న వాస్తవాన్ని ఆగ్రహించాలన్నారు. మీడియా ముందు నిర్లజ్జగా అబద్దాలు చెప్పడంలో పేర్ని నానిని మించిన వాళ్లు లేరని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కొల్లు రవీంద్ర పని చేస్తున్నారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర తన ఆస్తులను రెట్టింపు చేసుకోవడానికి రోడ్ల విస్తరణ చేస్తున్నారని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అతని అవివేకాన్ని తెలియజేస్తున్నాయన్నారు. కులాలను రెచ్చగొట్టడమే పనిగా పేర్ని నాని పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
Andhra Pradesh
Machilipatnam
Perini Nani
Kollu Ravindra
Development Dispute
Road Expansion
Political Allegations
మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని
పల్లపాటి సుబ్రహ్మణ్యం
లోగిశెట్టి వెంకట స్వామి
Scroll for the next article