Politics26th Oct 05:49 PMSunil Byrisetty1 min read
వైసీపీని మించి టీడీపీ రాక్షస పాలన
రాష్ట్రంలో జగన్ ను మించి చంద్రబాబు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన తప్పులకంటే పదింతలు ఎక్కవగా చంద్రబాబు తప్
రాష్ట్రంలో జగన్ ను మించి చంద్రబాబు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన తప్పులకంటే పదింతలు ఎక్కవగా చంద్రబాబు తప్పులు చేస్తున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారన్నారు. జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా నకిలీ లిక్కర్ నే తయారు చేసి అమ్మేస్తున్నారన్నారని ఆరోపించారు. పేదలు, మధ్య తరగతి ప్రాణాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్సికల్స్ కు 37 వేల కోట్లు కాంట్రాక్టులు కట్టబెడితే.. చంద్రబాబు హయాంలో 69 వేల కోట్లు దోచిపెట్టారన్నారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తే.. చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఉద్యోగాలు చేస్తున్న టీచర్లకు టెట్ నిర్వహించాలన్న నిబంధనను వ్యతిరేకించపోవడమే దానికి ఉదాహరణ అన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జగన్ హయాంలో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబుకు అధికారం ఇస్తే ఆయన పది రెట్లు అరాచకం చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో పోలీస్ శాఖను అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే విష సంస్కృతిని పెంచి పోషిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖను తెలుగుదేశం పార్టీ విభాగంగా మార్చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.