News25th Aug 09:30 AMSunil Byrisetty1 min read
వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు షేక్ సాదియా ఆల్మస్
కోస్తారికా రాజధాని శాన్ జోస్ లో సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరుగనున్న వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మంగళగిరికి చెందిన అంతర్జాతీయ మహిళా పవర్ లిఫ్టర్ సాదియా ఆల్మస్ బ
కోస్తారికా రాజధాని శాన్ జోస్ లో సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరుగనున్న వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మంగళగిరికి చెందిన అంతర్జాతీయ మహిళా పవర్ లిఫ్టర్ సాదియా ఆల్మస్ బయలుదేరి వెళ్ళింది. ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధానీ తెలిపారు. సాదియా ఆల్మస్ కు ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం విదితమే. అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షేక్ సాదియా అల్మాస్ మంచి ప్రతిభ కనబర్చి బంగారు పతకంతో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, ప్రత్యేకంగా మంగళగిరి కి మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు. ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి తమ సొంత నిధులతో ఆర్థిక సహాయం అందిస్తున్న మంత్రి నారా లోకేష్ కు జిల్లా, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.