News29th Mar 01:43 PMSunil Byrisetty1 min read
రేషన్ ఈకేవైసీ చేయలేదా.. పెరిగిన గడువు
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. రాష్ట్రంలో ఎక్కడ నివసిస్తున్నా స్థానిక సచివాలయంలో వేలి ముద్ర, ఐరిస్ ఇచ్చి ఈకేవైసీ చేయించుకోవాలి. త
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి.
రాష్ట్రంలో ఎక్కడ నివసిస్తున్నా స్థానిక సచివాలయంలో వేలి ముద్ర, ఐరిస్ ఇచ్చి ఈకేవైసీ చేయించుకోవాలి.
తద్వారా కార్డులో ఉన్న సభ్యులందరూ ఉన్నారా లేదా అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది.
వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించడం, వేరే కార్డులు జారీ చేయడానికి ఈకేవైసీ అవసరం.
అయితే ఈకేవైసీకి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు.
దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.