News29th May 03:22 PMSunil Byrisetty1 min read
రేషన్.. ఆదివారం కూడా ఓపెన్!
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన నేపథ్యంలో రేషన్ షాపులను ఆదివారం కూడా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఇబ్బందులు, బియ్యం స్మగ్లింగ్ నివారణకే ఈ నిర్ణయమని మంత్రి నాదెండ్ల మనోహర్ పే
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన నేపథ్యంలో రేషన్ షాపులను ఆదివారం కూడా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఇబ్బందులు, బియ్యం స్మగ్లింగ్ నివారణకే ఈ నిర్ణయమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ల కోసం ఎదురుచూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ షాపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.
వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు
చేస్తున్నారు. మార్కెట్‌లో ధరలు పెరిగితే సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరఫరా చేస్తారు.