News10th Sep 01:25 PMSunil Byrisetty1 min read
పెరిగిన జీఎస్టీ కలెక్షన్స్.. వృద్ధిరేటు
8వ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగాం. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టు
8వ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగాం. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని, వారి ఆరోగ్యం కూడా దెబ్బతిందని పేర్కొన్నారు. కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నామన్నారు. విద్యుత్ టారిఫ్ పెంచకుండా... నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నామని తెలిపారు. ప్రతీ మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నామని వివరించారు. 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదైందని, జీఎస్టీ కలెక్షన్స్ కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగిందని వివరించారు.