News24th Jul 10:48 AMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో 51% వర్షపాతం లోటు!
రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టాలో 49% వర్షపాతం లోటు ఉందని ఇరిగేషన్ ఈఎన్సీ కే. నరసింహ మూర్తి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయన్నారు. ఎగువ ప్రాజెక్ట
రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టాలో 49% వర్షపాతం లోటు ఉందని ఇరిగేషన్ ఈఎన్సీ కే. నరసింహ మూర్తి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయన్నారు. ఎగువ ప్రాజెక్టుల్లో కుషన్ నీటి కారణంగా శ్రీశైలానికి ప్రవాహాలు తగ్గాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. 2027 జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం నీటి నిర్వహణ చేపడతామన్నారు. పులిచింతల నీటిని కూడా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచారని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి సరఫరా కొనసాగుతోందన్నారు. గోదావరిలో ప్రవాహాలు తగ్గడంతో పట్టిసీమ పంపింగ్‌పై ప్రభావం ఉందని, మరోవైపు సీలేరు నీటి లభ్యత కూడా తగ్గిందని చెప్పారు. కృష్ణా డెల్టా సాగుకు అవసరమైన నీటి లభ్యత ప్రస్తుతం లేదని ఆయన పేర్కొన్నారు.