News9th Sep 04:10 PMSunil Byrisetty1 min read

గోదావరి పుష్కరాలకు రాచమార్గాలు

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టనున్న గోదావరి పుష్కరాలు – 2027కు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్

గోదావరి పుష్కరాలకు రాచమార్గాలు
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టనున్న గోదావరి పుష్కరాలు – 2027కు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్ & బీ రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ. 300 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని R&B శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. 6 జిల్లాల్లో 431 కి.మీ మేర రహదారుల పునర్నిర్మాణం, రోడ్ల ఆధునీకరణ చేపడుతున్నామన్నారు. గోదావరి తీర, పరిసర ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం, ఏలూరు జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలోని 78 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంజూరైన రూ. 300 కోట్ల నిధులతో ఈ 6 జిల్లాల వ్యాప్తంగా దాదాపు 431 కిలోమీటర్ల పొడవైన స్టేట్ హైవేలు (SH), జిల్లా ప్రధాన రహదారులను (MDR) అభివృద్ధి చేయనున్నారు.
Andhra Pradesh
Godavari Pushkarams 2027
Godavari Pushkaralu
Chandrababu Naidu
BC Janardhan Reddy
Andhra Pradesh Government
R&B Department
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
కాకినాడ
కోనసీమ
పోలవరం
ఏలూరు
భక్తుల సౌకర్యాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article