News22nd Apr 01:05 PMSunil Byrisetty1 min read
సీనియర్ IPS పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు ఆయన్ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజ
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు.
ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు ఆయన్ను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులు పని చేశారు.
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఏపీకి తరలిస్తున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేసినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో సజ్జన్ జిందాల్ కంపెనీపై జెత్వానీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో జెత్వానీని పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో పోలీసులు అదుపులోకి తీసుకుని వేధించారని ఆమె కేసు పెట్టింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు ఇప్పుడు పీఎస్ఆర్‌ను బుక్ చేశారు.