News12th Nov 02:17 PMSunil Byrisetty1 min read

నెక్స్ట్-జెన్ సముద్ర సాంకేతికతకు కేంద్రంగా ఏపీ

తదుపరి తరం సముద్ర సాంకేతికతలకు దేశంలోనే అత్యంత కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోంది. విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో భారీ ప్రాజెక్టులను

నెక్స్ట్-జెన్ సముద్ర సాంకేతికతకు కేంద్రంగా ఏపీ
తదుపరి తరం సముద్ర సాంకేతికతలకు దేశంలోనే అత్యంత కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోంది. విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో భారీ ప్రాజెక్టులను ఆకర్షిస్తోంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ రక్షణ, సముద్ర సాంకేతిక సంస్థ 'సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్' సీఈఓ నికుంజ్ పరాశర్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టబోయే భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ప్రభుత్వ పూర్తి సహకారంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద అత్యాధునిక, స్వయం ప్రతిపత్తితో పనిచేసే మారిటైమ్ షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నికుంజ్ పరాశర్ వెల్లడించారు. సీఐఐ సదస్సు వేదికగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అందించిన భరోసా, ప్రోత్సాహం తమ సంస్థలో అపారమైన విశ్వాసాన్ని నింపాయని కొనియాడారు."మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు (AI), స్వయంప్రతిపత్తి వ్యవస్థల సమ్మేళనంతో సముద్ర రంగంలో 5వ పారిశ్రామిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతోందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకునేందుకు, రాష్ట్రాన్ని గ్లోబల్ మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సాగర్ డిఫెన్స్ సంస్థ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన హామీ చేశారు.
Scroll for the next article