News13th Oct 05:29 PMSunil Byrisetty1 min read
ఆసియాలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఏపీ
దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక
దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న జాతీయ మిషన్ లో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొననున్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మంత్రి కందుల దుర్గేష్ బృందం హాజరుకానుంది. ఈ సందర్భంగా జాతీయ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ తరపున పర్యాటక ప్రతిపాదనలను మంత్రి దుర్గేష్ వివరించనున్నారు. ఈ చారిత్రాత్మక సమావేశంలో జాతీయ మిషన్ లక్ష్యాల సాధనకు చేయనున్న కృషి, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధికి అందించే ప్రోత్సాహం, యువతకు ఉపాధి కల్పన, రాష్ట్ర పర్యాటక శాఖలో అవలంభిస్తున్న విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై కూటమి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వెల్లడించనున్నారు. 2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఏపీని ఒకటిగా నిలిపేందుకు తీసుకోనున్న చర్యలను సమావేశంలో వివరించనున్నారు.