News5th Aug 02:37 PMSunil Byrisetty1 min read

రెనెవ‌బుల్ ఎనర్జీ ప‌వ‌ర్ హౌస్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెనెవ‌బుల్ ఎన‌ర్జీ ప‌వ‌ర్ హౌస్ గా అభివృద్ధి చెందుతుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌వ‌ర్గంలో ఏర్పాటు చేస్తున్న రెనెవబుల్ ఎనర్జీ మ్యా

రెనెవ‌బుల్ ఎనర్జీ ప‌వ‌ర్ హౌస్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెనెవ‌బుల్ ఎన‌ర్జీ ప‌వ‌ర్ హౌస్ గా అభివృద్ధి చెందుతుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌వ‌ర్గంలో ఏర్పాటు చేస్తున్న రెనెవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (REMZ) ప్రాజెక్టుకు భూములు అందించిన రైతులకు మంత్రి గొట్టిపాటి ప‌రిహారం చెక్కుల‌ను పంపిణీ చేశారు. 175.41 ఎక‌రాలు ఇచ్చిన 37 మంది రైతుల‌కు రూ.31,57,38,000., విలువైన చెక్కుల‌ను అంద‌జేశారు. సుమారు వెయ్యి ఎక‌రాల్లో ఏర్పాట‌వుతున్న రెమ్జ్ సెజ్ కు సంబంధించిన‌ మిలిగిన రైతుల‌కు కూడా అతి త్వ‌ర‌లో ప‌రిహారం పంపిణీ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. భూసేకరణలో ఒక్క సెంటు భూమి కూడా వ్యత్యాసం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, భూములు అందించిన ప్రతి కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని అన్నారు.
Andhra Pradesh
Renewable Energy
REMZ
Addanki
Gottipati Ravi Kumar
రైతులు
భూసేకరణ
గ్రీన్ ఎనర్జీ
సెజ్
Scroll for the next article