News10th Aug 04:31 PMSunil Byrisetty1 min read

గ్లోబల్ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్

గ్లోబల్ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్
దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో), ట్రావెల్ ట్రేడ్ భాగస్వాములు, హోటల్ రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశం జరిగింది. ఏపీలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని, అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీరప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం విరాజిల్లుతోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలు, మెరుగైన రవాణా వసతులను ఉపయోగించుకొని రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య, వారి బస సమయం పెంచేలా వినూత్న టూర్ ప్లాన్లు, డెస్టినేషన్ ఆధారిత, అనుభవపూర్వక, సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశ విదేశీ టూర్ ఆపరేటర్లను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. ట్రావెల్ రంగానికి చెందిన భాగస్వాములతో బలమైన సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. డెస్టినేషన్ ఫెమిలియరైజేషన్ విజిట్లు, ప్రచార మద్దతు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మరియు ఇతర భాగస్వాముల సదుపాయాల కల్పన ద్వారా టూర్ ఆపరేటర్లకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh Tourism
AP Tourism
Global Tourism
Tourism Development
Tourism Minister Kandula Durgesh
IATO
తీరప్రాంత పర్యాటకం
ప్రకృతి పర్యాటకం
వెల్నెస్ టూరిజం
క్రూయిజ్ టూరిజం
పర్యాటక పెట్టుబడులు
Scroll for the next article