News16th Jan 05:30 PMSunil Byrisetty1 min read

గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటి

గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం గమనార్హం. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కాకినాడలో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకినాడకు వెళ్తారు. 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Andhra Pradesh
Green Ammonia
Green Hydrogen
Clean Energy
AM Green
Greenko Group
Kakinada
Sustainable Industry
పునరుత్పాదక శక్తి
సీఎం చంద్రబాబు నాయుడు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Scroll for the next article