News14th Nov 05:11 PMSunil Byrisetty1 min read
సెమీకండక్టర్స్ రంగంలో కీలకంగా మారతాం
ఏపీని ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్టర్స్ రంగాల్లో కీలక భాగస్వామిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆయన మాట్లాడారు. ఈనాడు
ఏపీని ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్టర్స్ రంగాల్లో కీలక భాగస్వామిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆయన మాట్లాడారు. ఈనాడు కేవలం కొత్త తరం టెక్నాలజీని మాత్రమే చూడటంలేదు, భారతదేశం గ్లోబల్ హై-టెక్ తయారీ రంగాన్ని మహాశక్తిగా మార్చాలనే ఆశయాన్నీ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి, అవకాశం, బలోపేతం (ఎలక్ట్రానిక్స్)పై పెట్టుబడిదారుల దృక్పథం అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ లోకి ఏపీ కొంచెం ఆలస్యంగా ప్రవేశించిందని చెప్పారు. 2014-19 మధ్య మనకు మొదటి అవకాశం వచ్చిందన్నారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఏర్పడిన ఎకో సిస్టమ్ వల్ల ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1,2 వచ్చాయని తెలిపారు. ఇది మన మొదటి ప్రయత్నమని, గత ఐదేళ్లు బ్రేక్ పడినా, అది పెద్ద అడ్డంకి కాదన్నారు. ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టామని, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. పెట్టుబడిదారులను రాష్ట్రంలోకి తిరిగి రావాలని, మళ్లీ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని వివరించారు.