News7th Jan 02:52 PMSunil Byrisetty1 min read

రోడ్ల నిర్మాణంలో గిన్నిస్ రికార్డ్!

జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధించింది. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ క

రోడ్ల నిర్మాణంలో గిన్నిస్ రికార్డ్!
జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధించింది. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపే 28.95కి.మీ రహదారిని 24 గంటల్లోనే నిర్మించారని తెలిపారు. దీనికోసం 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వాడకం మరో రికార్డు అన్నారు. భారత ప్రభుత్వ, కేంద్ర మంత్రి గడ్కరీ విజన్, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
Andhra Pradesh
Guinness World Records
National Highways
Road Construction
Infrastructure Development
చంద్రబాబు నాయుడు
నితిన్ గడ్కరీ
భారత మౌలిక వసతులు
Scroll for the next article