News4th Jan 01:40 PMSunil Byrisetty1 min read

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ!

రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపి వేయించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. తన విన్నపం మేరకు చంద్ర

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ!
రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపి వేయించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. తన విన్నపం మేరకు చంద్రబాబు పనులు నిలిపివేశారన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ చేపట్టిన జగన్ ప్రచారంతో పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్రం ఎన్ జి టి తోపాటు పలుచోట్ల తెలంగాణ ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ఫిర్యాదుతో విచారించి అనుమతులు లేనందున పనులు నిలిపివేశారని గుర్తు చేశారు. 2020 లోనే ఈ మేరకు ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పనులు నిలిపివేస్తే అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
Andhra Pradesh Government
Revanth Reddy
Rayalaseema Lift Irrigation Project
Telangana Government
NGT Orders
కేంద్ర ప్రభుత్వం
నీటి వివాదం
రాజకీయ విమర్శలు
Scroll for the next article