Health18th Mar 10:21 AMSunil Byrisetty1 min read
ప్రత్యేక మండళ్లతో ఆయుష్ వైద్యుల రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టాన్ని మరింత వ్యవస్థీకృతం చేయాలనని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చట్ట
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టాన్ని మరింత వ్యవస్థీకృతం చేయాలనని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యుల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక మండళ్లు ఏర్పాటు కానున్నాయి.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యుల రిజిస్ట్రేషన్ చట్టాని(1956)కి సంబంధించి మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఉపసభాపతి వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం..ఆయుర్వేద, హోమియో,యునాని వైద్యులకు ఒకే బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజా సవరణతో రిజిస్ట్రేషన్ల కోసం విడివిడిగా మండళ్లు ఏర్పాటు చేస్తారు.
ఇక నుంచి ఆయుర్వేద, యునాని వైద్యులు ఆయా మండళ్ల ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.