Politics22nd Mar 01:19 PMSunil Byrisetty1 min read

సలహాదారులంటే ఇలా ఉండాలి జగన్

రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయిన వారికి, రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చేందుకు సృష్టించిన సలహాదారు పదవులు గత ప్రభుత్వంలో నవ్వుల పాలయ్యాయి. వందల కోట్ల నిధులు జీతాలుగా చెల్లించి, గత వైస

సలహాదారులంటే ఇలా ఉండాలి జగన్
రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయిన వారికి, రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చేందుకు సృష్టించిన సలహాదారు పదవులు గత ప్రభుత్వంలో నవ్వుల పాలయ్యాయి. వందల కోట్ల నిధులు జీతాలుగా చెల్లించి, గత వైసీపీ ప్రభుత్వంలో 50కి పైగా సలహాదారు పదవులు సృష్టించారు. పోసానిలాంటి వారు, ఇతర ప్రబుద్ధులు వైసీపీ హయాంలో ఏ విధంగా భ్రష్టు పట్టించారో చూశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సలహాదారుల నియామకాలు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సమాజంలో ఉన్నత పదవులు నిర్వహించి, ఆదర్శంగా నిలిచిన నలుగురిని సలహాదారులుగా నియమించి ప్రశంసలు అందుకుంటున్నారు. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, స్పేస్ టెక్నాలజీ నిపుణులు సోమనాథ్, ఫోరెన్సిక్ నిపుణులు కేపీసీ గాంధీ, డీఆర్డీవో మాజీ చీఫ్, కేంద్ర ప్రభుత్వ రక్షణ సలహాదారు సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించారు. వీరు పేదలు, మహిళల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా చేయడం, డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడం, డీప్ టెక్నాలజీ, ఏఐ, స్పేస్ అనలిటిక్స్, జీపీఎస్, ఫోరెన్సిక్ టెక్నాలజీ ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయడం, అత్యాధునిక సాంకేతికత వినియోగంలో వీరంతా సలహాలు ఇచ్చేవారు. అదే వైసీపీ హయాంలో పార్టీ కోసం సలహాదారులు పని చేశారు కానీ ప్రజలకు, సమాజానికి కాదు. కూటమి ప్రభుత్వం నియమించిన సలహాదారులు సమాజానికి, రాష్ట్ర ప్రగతికి దోహదం పడేటువంటి గొప్ప వ్యక్తులు కావడంతో ప్రశంసలు వస్తున్నాయి. విశ్లేషకులు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని చూసి జగన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Andhra Pradesh
Advisor's
చంద్రబాబు
జగన్
Scroll for the next article