News5th May 06:09 PMSunil Byrisetty1 min read

ఏపీ ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య ఎంవోయూ

అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ నడుమ ఒక అవగాహన ఒప్పం

ఏపీ ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య ఎంవోయూ
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ నడుమ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ లను ఏర్పాటుచేస్తారు. ఈ ల్యాబ్‌లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామగ్రి కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు రూ.15 కోట్ల అంచనా తో మంగళగిరిలో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురం లో ష్నైడర్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా లో ష్నైడర్ ఎలక్ట్రిక్ మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్ పైలెట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.
Andhra Pradesh
APSSDC
Skill Development Corporation
Schneider Electric India Foundation signed the MoU
NAC Training Centers
ఎలక్ట్రానిక్స్
గ్రీన్ ఎనర్జీ
ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్
Scroll for the next article