News18th Sep 11:11 AMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంపుపై చర్యలు

రాష్ట్రంలో ఇప్పటికే 5,006.35 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని, దీన్ని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమా

రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంపుపై చర్యలు
రాష్ట్రంలో ఇప్పటికే 5,006.35 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని, దీన్ని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అసెంబ్లీలో తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంపు కోసం ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చామని, రాష్ట్రంలో సోలార్‌ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మోడల్‌ స్కూల్‌లు, కేజీబీవీ వసతి గృహాల్లో 2,138 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద 3,550 కిలోవాట్ల ఉత్పత్తి లక్ష్యంతో 415 స్కూళ్లలో సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా, గ్రామపంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలపై కూడా రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పునరుత్పత్తి శక్తి వినియోగాన్ని విస్తరించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Solar Power
Renewable Energy
Clean Energy Policy
Green Energy
Solar Capacity
Rooftop Solar
Minister Ravikumar
అసెంబ్లీ అప్‌డేట్స్
విద్యుత్ ఉత్పత్తి
Scroll for the next article