News22nd Sep 12:09 PMSunil Byrisetty1 min read
మెట్రో రైలు.. మరో ముందడుగు!
ఏపీలో తొలి మెట్రో రైళ్ల కోసం ముందడుగు పడింది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో
ఏపీలో తొలి మెట్రో రైళ్ల కోసం ముందడుగు పడింది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని ఏపీ ఎంఆర్ సీఎల్ కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఫేజ్ - 1 లో విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్లు,విజయవాడలో 38 కిలోమీటర్ల మేర ఉన్న 40 శాతం సివిల్ పనులకు టెండర్లు పిలిచినట్లు మెట్రో రైలు ఎండీ రామకృష్ణా రెడ్డి చెప్పారు.
మరోవైపు రెండు ప్రాజెక్ట్ లను రికార్డు టైంలో 2028 నాటికి పూర్తి చేయడంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగిపోకూడదనే ఉద్దేశంతో పనులను చిన్న చిన్న ప్యాకేజిలుగా విభజించడం లేదని అన్నారు. విశాఖపట్నం మెట్రో టెండర్లకు అక్టోబర్ 10వ తేదీని,విజయవాడ మెట్రో రైలు టెండర్లకు అక్టోబర్ 14 వ తేదీ గడువు విధించినట్లు ఏపీఎంఆర్సీఎల్ ఎండీ రామకృష్ణా రెడ్డి చెప్పారు.