News1st Oct 05:24 PMSunil Byrisetty1 min read

ప్రఖ్యాత ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు

విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయ

ప్రఖ్యాత ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు
విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్ తో పాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు. మేకిన్ ఇండియా, స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డ్ మొదటిసారి భారతదేశానికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారి ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్ట్ వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివరించారు.
Andhra Pradesh
Airbus
Aerospace
Investment
Aerospace Policy
Aviation Industry
Global Manufacturing
Nara Lokesh
ఏరోస్పేస్
పెట్టుబడులు
మేక్ ఇన్ ఇండియా
టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్
Scroll for the next article