News28th Apr 11:01 AMSunil Byrisetty1 min read

75% హాజరు ఉంటేనే తల్లికి వందనం!

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఏటా తల్లికి వందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత

75% హాజరు ఉంటేనే తల్లికి వందనం!
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఏటా తల్లికి వందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కూడా 75 శాతం హాజరు ఉన్న వారికే అమ్మఒడి అందించారు.
Andhra Pradesh
CM Chandra Babu
75 Percent Attendance Rule
Talliki Vandanam
తల్లికి వందనం పథకం
75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం
విద్యార్థులందరికీ ఏటా తల్లికి వందనం
Scroll for the next article