Education3rd Sep 01:05 PMSunil Byrisetty1 min read

రెండేళ్లలో అక్షరాస్యతలో సరికొత్త రికార్డు

అక్షరాస్యతలో వెనుకబడిన ఏపీ, రెండేళ్లలోనే అనూహ్య ప్రగతి సాధించింది. 2024లో 72.6 శాతంగా ఉన్న అక్షరాస్యత, మంత్రి నారా లోకేష్ పక్కా ప్రణాళికలతో 2026 నాటికి ఏకంగా 82.1 శాతానికి చేరి విద

రెండేళ్లలో అక్షరాస్యతలో సరికొత్త రికార్డు
అక్షరాస్యతలో వెనుకబడిన ఏపీ, రెండేళ్లలోనే అనూహ్య ప్రగతి సాధించింది. 2024లో 72.6 శాతంగా ఉన్న అక్షరాస్యత, మంత్రి నారా లోకేష్ పక్కా ప్రణాళికలతో 2026 నాటికి ఏకంగా 82.1 శాతానికి చేరి విద్యా రంగంలో కొత్త మైలురాయిని తాకింది. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి ఈ రికార్డు సాధించింది. క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలతో గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 25 లక్షల మందిని కొత్తగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. LEAP యాప్ ద్వారా బడికి దూరమైన 1.64 లక్షల మంది పిల్లలను గుర్తించి, అందులో 33 వేల మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. మార్చి 2027 నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబర్ 2027 నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చి వందశాతం అక్షరాస్యత సాధించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Andhra Pradesh Literacy
Literacy Rate
AP Education
Nara Lokesh
Akshara Andhra
Education News
Andhra Pradesh Government
Literacy Programme
బడికి దూరమైన పిల్లలు
వందశాతం అక్షరాస్యత
అక్షరాస్యత ప్రచారం
అమరావతి
ఏపీ న్యూస్
విద్యాశాఖ మంత్రి
Scroll for the next article