Education21st Apr 03:26 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్!

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తోంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి మూడు రోజులపాటు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్!
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తోంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి మూడు రోజులపాటు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న వారిని ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేర్పించడం, ఐదో తరగతి పూర్తయిన వారిని ఆపై తరగతిలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం ముగింపునకు చేరినందున పైతరగతులకు వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచడంతోపాటు, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నందున ప్రవేశాలను పెంచాలనే లక్ష్యంతో డ్రైవ్ నిర్వహిస్తోంది.
Andhra Pradesh
Government Schools
Chandra Babu Naidu
Boost Enrollment
మూడు రోజులపాటు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్
మెగా డీఎస్సీ
Scroll for the next article