News2nd Dec 05:06 PMSunil Byrisetty1 min read

పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం

డిసెంబర్ 1,2 తేదీల్లో ముంబయిలో జరిగిన ప్రతిష్టాత్మక 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025 వేదికగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర, పర్యాటక రంగాలను కీలక సాధనాలుగా వినియోగించుకోవాలన

పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం
డిసెంబర్ 1,2 తేదీల్లో ముంబయిలో జరిగిన ప్రతిష్టాత్మక 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025 వేదికగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర, పర్యాటక రంగాలను కీలక సాధనాలుగా వినియోగించుకోవాలని రెండో రోజు మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట తమదైన శైలిలో ఇన్వెస్టర్లకు దిశానిర్దేశం చేసి పెట్టుబడులను ఆహ్వానించారు. తీర ప్రాంతాల నుంచి సినీ కారిడార్ల వరకు సంబంధించిన అన్ని రంగాలలో భారతదేశ పర్యాటక, సృజనాత్మక ఆర్థికవ్యవస్థలో కొత్త మార్గాన్ని నిర్దేశించిన ఈ సమ్మిట్ లో ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా చలనచిత్ర నిర్మాణం, పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలపై ఇన్వెస్టర్లకు స్పష్టతనిచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే స్వర్ణాంధ్ర విజన్ @2047 ను పంచుకున్నారు. ఈ ప్రణాళికలో కీలకమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ,డీప్ టెక్నాలజీల పాత్రను వివరించారు.
Andhra Pradesh Investments
CII Big Picture Summit 2025
Minister Kandula Durgesh
Amrapali Kata
Tourism Development
Film Industry Growth
Creative Economy
APETA
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ
ఇన్వెస్టర్ మీట్
స్వర్ణాంధ్ర విజన్ 2047
ఆర్థిక అభివృద్ధి
Scroll for the next article