News15th Jul 05:59 PMSunil Byrisetty1 min read
ఆయుష్ వైద్యానికి హబ్ గా ఆంధ్రప్రదేశ్
ఆయుష్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ను హబ్ గా మారుస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత నిరాదరణకు గురైన ప్ర
ఆయుష్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ను హబ్ గా మారుస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత నిరాదరణకు గురైన ప్రాచీన ఆయుష్ వైద్యానికి పునరుజ్జీవం తెచ్చేందుకు రూ. 414 కోట్లతో అభివృద్ధి చర్యల్ని చేపట్టామని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో "ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు" అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, నేచురోపతి, హోమియోపతి) విభాగం పరిధిలో భారీ అంచనా వ్యయంతో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కేవలం రోగం వచ్చిన తర్వాత చికిత్స అందించే 'రియాక్టివ్–క్యూరేటివ్' విధానం నుంచి, రోగాలను ముందుగానే గుర్తించి నివారించే 'ప్రెడిక్టివ్–ప్రివెంటివ్–వెల్‌నెస్ సెంట్రిక్' ఆరోగ్య విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రాచీన ఆయుష్ వైద్య సేవల విస్తరణలో భాగంగా రూ. 280 కోట్లతో నాలుగు కొత్త ఆయుష్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.