News2nd Aug 12:35 PMSunil Byrisetty1 min read
జూన్ 5 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ
వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచ
వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా రాష్ట్ర సచివాలయాన్ని ఈ నెల 15 కల్లా తీర్చిదిద్దాలని రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. “రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం” పై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అవగాహన & శిక్షణా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. హాజరైన అన్ని శాఖల సచివాలయ ఎం.ఎల్.ఓ.లను ఉద్దేశించి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా మైక్రో ప్లాస్టిక్ కారకాల వల్ల మానవాళి, పశుపక్ష్యాదుల ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీస్తున్నాయన్నారు. అందుకే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మిషన్ మోడ్ లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.