News9th Nov 03:47 PMSunil Byrisetty1 min read

రూ. 1081 కోట్లతో గుంతల రహిత రాష్ట్రంగా ఏపీ

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కార్పొరేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రూ. 1081 కోట్లతో గుంతల రహిత రాష్ట్రంగా ఏపీ
రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కార్పొరేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆర్ & బి ఇఎన్ సీ (ENC) కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APRDC) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, గత ఐదేళ్లలో రోడ్లను కనీసం రెన్యువల్ కూడా చేయకపోవడంతో రాష్ట్రంలో వేల కి.మీ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలల కాలంలోనే రూ. 1,081 కోట్ల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం, ఆర్ అండ్ బి శాఖపై ప్రజల్లో సానుకూలత నెలకొందన్నారు. ఇటీవలి తుపాన్ ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో కొంత మేర రహదారులు బాగానే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ, గుంటూరు జిల్లాలలో పాడైన రహదారులపై దృష్టి పెడుతున్నామన్నారు.
Andhra Pradesh
Road Development
Pothole-Free
BC Janardhan Reddy
APRDC
Infrastructure Development
R&B Department
రోడ్ల పునరుద్ధరణ
ప్రభుత్వ ప్రాజెక్ట్
రాష్ట్రంలో రహదారులు
హైవే మేమెంటెన్స్
Scroll for the next article