News15th Oct 04:52 PMSunil Byrisetty1 min read

మరింత అభివృద్ధి దిశగా ఏపీ జల రవాణా వ్యవస్థ

ముక్త్యాల – మచిలీపట్నం పోర్టు మధ్య జలమార్గ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రాథమికంగా రూ. 1700 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టుకు ఇప్పటికే జాతీయ జలమార్గాల అధారిటీ

మరింత అభివృద్ధి దిశగా ఏపీ జల రవాణా వ్యవస్థ
ముక్త్యాల – మచిలీపట్నం పోర్టు మధ్య జలమార్గ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రాథమికంగా రూ. 1700 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టుకు ఇప్పటికే జాతీయ జలమార్గాల అధారిటీ గ్రీన్ సిగ్నల్ లభించింది. DBFOT (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆఫరేట్, ట్రాన్స్ ఫోర్ట్) పీపీపీ విధానంలో 168 కి.మీ జలమార్గం అభివృద్ధి కానుంది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వరకు 82 కి.మీ, బందరు కాలువలో మచిలీపట్నం వరకు 86 కి.మీ మేర జలమార్గం ఉంటుంది. జగ్గయ్యపేట పారిశ్రామిక కారిడార్ నుంచి మచిలీపట్నం పోర్టుకు తక్కువ వ్యయంతో కార్గో జల రవాణా సాధ్యం కానుంది. డిసెంబర్ 2026 నాటికి పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ ద్వారా రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గనుంది.
Scroll for the next article