Education22nd Aug 04:20 PMSunil Byrisetty1 min read

ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా డిఎస్సీ

రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం, ఇకపై ప్రతిఏటా డిఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీచేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రాని

ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా డిఎస్సీ
రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం, ఇకపై ప్రతిఏటా డిఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీచేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశామని చెప్పారు. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలేనన్నారు. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు.
Andhra Pradesh
DSC Recruitment
Teacher Posts
Nara Lokesh
Mega DSC
Annual DSC
టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా డిఎస్సీ
Scroll for the next article