News25th Sep 05:42 PMSunil Byrisetty1 min read
దసరా నుంచి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దసరా నుంచి దీపావళి వరకూ ప్రత్యేక ప్రచార అవగాహ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అనగా దసరా నుంచి దీపావళి వరకూ ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జిఎస్టి 2.0 ప్రయోజనాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించేందుుకు సచివాలయంలో సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చిన జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.కావున వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు వారి వారి శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి వరకూ ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళి విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.