Education2nd Jan 04:46 PMSunil Byrisetty1 min read
పారా మెడికల్ విద్యార్థులకు సప్లిమెంటరీ
ఆంధ్రప్రదేశ్లో పారా మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే, ఆ సబ్జెక్టులను యాన్యువల్ పరీక్షలతో పాటు మళ్లీ రాయాల్సి వచ్
ఆంధ్రప్రదేశ్లో పారా మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే, ఆ సబ్జెక్టులను యాన్యువల్ పరీక్షలతో పాటు మళ్లీ రాయాల్సి వచ్చేది. దీనివల్ల ఏడాదిపాటు వేచి ఉండాల్సి వచ్చి ఉపాధి అవకాశాలు కోల్పోయేవారు. అయితే, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో, 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. విద్యార్థులు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.