News13th Nov 03:01 PMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లు
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ (APEX) కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన 6 ప్రతిభావంతమైన స్టార్టప్ ల నిర్వాహకులను అభినందించి, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన 31 స్టార్టప్ లకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందించారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన అప్రూవల్ లెటర్స్, చెక్కులను ఆయా స్టార్టప్ సంస్థలకు అందజేశారు. రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్ వంటి సంప్రదాయ రంగాల నుంచి క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల వరకు ఈ ఎకోసిస్టమ్‌లను నిర్మిస్తున్నామని వివరించారు.