News4th Sep 04:53 PMSunil Byrisetty1 min read
రేషన్ షాపుల్లో ఉల్లి
రేషన్ దుకాణాల బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ
రేషన్ దుకాణాల బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు. ముందుగా కర్నూలు జిల్లాలో ప్రారంభించి, తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మరోవైపు హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.