Politics6th Sep 11:30 AMSunil Byrisetty1 min read
పాత పద్ధతిలో మున్సి‘పోల్స్’
ఆంధ్రాలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక శాఖ జీవో నంబర్లు 210, 211 జ
ఆంధ్రాలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక శాఖ జీవో నంబర్లు 210, 211 జారీ చేసింది. ఈ నూతన చట్టసవరణ ద్వారా మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికల నిబంధనల్లో పారదర్శకత పెంచేలా మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఎస్ఈసీ పునేఠా బ్యాలెట్ పేపర్లతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ఎంపికను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకునేలా మార్పులు చేశారు. డిప్యూటీ మేయర్లను మాత్రం.. ఎన్నికలు పూర్తయిన పదిహేను రోజుల్లో ఎన్నుకుంటారు. పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్ మొత్తాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్‌గా రూ. 5,000 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు ఊరటనిస్తూ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2,500, కొన్ని ప్రాంతాల్లో రూ. 2,000 గా నిర్ణయించారు.