News7th Dec 09:40 AMSunil Byrisetty1 min read

బీసీల కోసం 21 లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పీఎం కుసుమ్, పీఎం

బీసీల కోసం 21 లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, అన్ని ఎన్ఆర్ఈడిసిఏపి ప్రాజెక్టులు, వివిధ పథకాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 7.48 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు వచ్చే ఏడాది మార్చిలోగా ఫీజిబిలిటీ ఉన్న గృహాలపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో రూప్ టాప్ సోలార్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్యానల్స్ ను అమర్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నెట్ మీటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎంకుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద అనంతపురం జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలని, ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బీసీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను అమర్చనున్నట్లు తెలిపారు.
Andhra Pradesh
BC households
Rooftop solar
APSPDCL
PM Kusum
PM SuryaGhar
Renewable energy
Solar projects
Government initiative
Energy reforms
రూఫ్‌టాప్ సోలార్
ఏపీఎస్పీడీసీఎల్
బీసీ గృహాలు
Scroll for the next article