News16th Dec 11:17 AMSunil Byrisetty1 min read

ఏఐ వినియోగం.. హెల్త్ డేటాతో అనుసంధానం

వైద్య ఆరోగ్య శాఖ వ‌ద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధ‌ను అనుసంధానం చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. తద్వారా ప్రజలు, రోగులకు ప్రివెం

ఏఐ వినియోగం.. హెల్త్ డేటాతో అనుసంధానం
వైద్య ఆరోగ్య శాఖ వ‌ద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధ‌ను అనుసంధానం చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. తద్వారా ప్రజలు, రోగులకు ప్రివెంటివ్‌ కేర్, ప్రిడిక్టెవ్ ఎనాలిస్, ఆయా ప్రాంతాల్లో రోగాల తీవ్రతను అంచనా వేసేందుకు, వైద్య సేవలు మెరుగుపరచడం సులువు అవుతుందని తెలిపారు. విజయవాడలో రీజినల్ మల్టీ స్టేక్‌ హోల్డర్స్‌ కన్వర్జన్స్ వర్క్ షాప్‌ అన్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్ (ఎన్ఎఐఎస్ హెచ్) అంశంపై ఒకరోజు కార్యశాల జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ‌, ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్ ఘడ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి వైద్య ఆరోగ్య, ఐటీ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కార్యశాలలో చర్చించిన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరరావు వివరించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి, జనరేట్‌ చేసుకోవడంపై 'మనమిత్ర' (వాట్సప్ గవర్నెస్) లో అనుసంధానం చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగించి కంటిన్యూస్ కేర్ 'సంజీవిని' ద్వారా ప్రజలు, రోగులకు సేవలు అందించబోతున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Health Department
AI in Healthcare
Preventive Care
Predictive Analysis
Health Data Integration
Sanjeevini
Ayushman Bharat
Emerging Technologies
నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్
ప్రజారోగ్య కార్యక్రమాలు
ఐటీ వినియోగం
Scroll for the next article