Politics13th Sep 01:14 PMSunil Byrisetty1 min read
ఫేక్ ప్రచారాలపై ప్రత్యేక చట్టం
సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉ
సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. నిబంధనల రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం ఫేక్ పోస్టులు పెడుతున్నా, సాంకేతిక సహకారంతో వారి స్థానం గుర్తించవచ్చని మంత్రి చెప్పారు. ఎక్కడో దాక్కుని పోస్టులు పెట్టే వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆమె, ముఖ్యంగా మహిళలపై వ్యక్తిత్వ హననం చేసే పోస్టులు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.