News8th Sep 04:17 PMSunil Byrisetty1 min read

డీ-మార్ట్‌కు పోటీగా వెయ్యి మీ-మార్ట్‌లు

డీ-మార్ట్‌కు పోటీగా మీ-మార్ట్‌లు సిద్ధం చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ తెలిపారు. సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా అక్టోబ‌ర్ 1న వెయ్యి మీ-మార్ట్‌లు ప్రారంభిస్తామ

డీ-మార్ట్‌కు పోటీగా వెయ్యి మీ-మార్ట్‌లు
డీ-మార్ట్‌కు పోటీగా మీ-మార్ట్‌లు సిద్ధం చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ తెలిపారు. సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా అక్టోబ‌ర్ 1న వెయ్యి మీ-మార్ట్‌లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘మీ మార్ట్‌ - నీది నాది మనందరిది’ అనే నూతన ఆలోచనతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ఎన్‌సీసీఎఫ్‌(నేషనల్‌ కో-ఆపరేటివ్‌ కన్స్యూమర్స్‌ ఫెడరేషన్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లాలో ముందుగా సుమారు వంద మార్ట్‌ల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సాధారణ ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే అందించనున్నారు.
Andhra Pradesh
Nadendla Manohar
Mee Mart
Chandrababu Naidu
DMart
Civil Supplies Department
NCCF
నిత్యావసర వస్తువులు
తక్కువ ధరలు
ఏపీ ప్రభుత్వం
రిటైల్ స్టోర్లు
Scroll for the next article