News24th Jul 03:46 PMSunil Byrisetty1 min read

సైబర్ నేరాలు అరికట్టేలా ఏపీటీఎస్

సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. వ

సైబర్ నేరాలు అరికట్టేలా ఏపీటీఎస్
సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ లోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటలూ ఐటీ ఇన్ ఫ్రాస్టక్చర్ ను పర్యవేక్షిస్తూ ముందస్తు హెచ్చరికలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కీలక భూమి పోషిస్తుందన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సైబర్ నేరాలకు నేరగాళ్లు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు అనే విషయాలతోపాటు మోసపోయిన అనంతరం ఎలా ఫిర్యాదు చేయాలి అనే విషయాలపై అవగాహన సదస్సుల్లో తెలియజేస్తామన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని సాంకేతికత ద్వారా వీటిని అరికట్ట వలసిన అవసరం ఉందన్నారు.
Andhra Pradesh news
APTS
Cyber Security
Cyber Crime Awareness
Digital security
Ap tech services
Online safety
సైబర్ నేరాలు అరికట్టేలా ఏపీటీఎస్
Scroll for the next article