News5th Aug 03:15 PMSunil Byrisetty1 min read
గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మారనున్న ఏపీ
గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రేపు విజయవాడ నోవాటెల్ హోటల్ లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లి
గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రేపు విజయవాడ నోవాటెల్ హోటల్ లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ ను చేపడుతోంది. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడంతో పాటు సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతోంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వాములు హాజరుకానున్నారు. భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ఈ గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మారనుంది. భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థకు మానవ వనరుల కేంద్రంగా ఎదగనుంది.