Health13th Oct 04:43 PMSunil Byrisetty1 min read
త్వరలో కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు
మూత్రపిండాల(కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) కింద కొత్తగా మరో 22 కేంద్రాలు త్వ
మూత్రపిండాల(కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) కింద కొత్తగా మరో 22 కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పిఎంఎన్‌డిపి కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కేంద్రాల(మొత్తం 83) ద్వారా ఉచిత డయాలసిస్ (రక్తశుద్ధి) సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పధకాల కింద ఉచితంగా అందించే డయాలసిస్ సేవల నిమిత్తం 2025-26లో రూ.197.88 కోట్లు వరకు వ్యయమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇటీవలి వరకు రూ.90.09 కోట్ల విలువైన డయాలసిస్ సేవల్ని పేద రోగులు పొందారు. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2019కు ముందు 28 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2019–24 మధ్య 19 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 2024–25 నుంచి మరో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు 22 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.