News25th Jul 04:48 PMSunil Byrisetty1 min read

80 ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో క‌లుషిత నీటి శుద్ధి ప్లాంట్లు

ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో జీవ వైద్య వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌(బ‌యో మెడిక‌ల్ వేస్ట్ మేనేజ్ మెంట్), క‌లుషిత నీటి శుద్ధీక‌ర‌ణ పూర్తిగా చ‌ట్టాలు, నియ‌మాల‌కు అనుగుణంగా జ‌ర‌గాల‌ని వైద్యారోగ్య శా

80 ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో క‌లుషిత నీటి శుద్ధి ప్లాంట్లు
ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో జీవ వైద్య వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌(బ‌యో మెడిక‌ల్ వేస్ట్ మేనేజ్ మెంట్), క‌లుషిత నీటి శుద్ధీక‌ర‌ణ పూర్తిగా చ‌ట్టాలు, నియ‌మాల‌కు అనుగుణంగా జ‌ర‌గాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. బోధనాసుప‌త్రులు, సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు క‌లుషిత జ‌లాల శుద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డంపై మంత్రి అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో కేవ‌లం నూజివీడు మ‌రియు బ‌న‌గాన‌ప‌ల్లి ఏరియా ఆసుప‌త్రుల్లో మాత్ర‌మే క‌లుషిత నీటి జ‌లాల శుద్ధి ప్లాంట్లు(సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్‌) ఉన్న‌ట్లు మంత్రి దృష్టికొచ్చింది. 40 బోధ‌న, సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల్లో 17 చోట్ల ఎస్‌టీపీలు లేవు. ఈ ప‌రిస్థితి ఆమోద‌యోగ్యం కాద‌ని, వెంట‌నే స‌వ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్(డిఎంఈ) ప‌రిధిలోని 17 బోధ‌న, స్పెషాలిటీ ఆసుప‌త్రులు, డైరెక్ట‌ర్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్‌(డిఎస్‌హెచ్‌) ప‌రిధిలోని మొత్తం 54 ఏరియా, 9 జిల్లా ఆసుప‌త్రుల్లో వెంట‌నే ఎస్‌టీపీల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు.
Andhra Pradesh
Satya Kumar Yadav
Government Hospitals
Sewage Treatment Plant
STP
Biomedical Waste
బోధనాసుపత్రులు
జిల్లా ఆసుపత్రులు
ఏరియా ఆసుపత్రులు
ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు
Scroll for the next article