News13th Jun 12:49 PMSunil Byrisetty1 min read

సొంత మండలాలకు సచివాలయ ఉద్యోగులా.. నో!

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం

సొంత మండలాలకు సచివాలయ ఉద్యోగులా.. నో!
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో జులై 10లోగా అప్‌లోడ్‌ చేయాలి. బదిలీల తరువాత సచివాలయాల్లో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా చోట్లే కొనసాగనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి అధికారాలు కల్పించింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.
Andhra Pradesh news
Village Ward Secretariat Employees Transfers Rule
HRMS Portal
Employees Transfers
ఏపీ గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ
సొంత మండలాల్లో నో పోస్టింగ్స్
Scroll for the next article