News15th Nov 01:43 PMSunil Byrisetty1 min read
మా లక్ష్యం.. ఇంటికో పారిశ్రామికవేత్త
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, పరిపాలన, భాగస్వామ్యాన్ని నేడు ఇన్నోవేషన్ నిర్ణయిస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్ టిఐహెచ్ – వన్ ఫ్యామ
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, పరిపాలన, భాగస్వామ్యాన్ని నేడు ఇన్నోవేషన్ నిర్ణయిస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్ టిఐహెచ్ – వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ – ఇన్నోవేషన్, ఇంక్లూజన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది తమ విజన్ అన్నారు. దీనిని కొంతమందికి మాత్రమే దక్కే హక్కుగా కాకుండా ఆచరణీయ మార్గంగా చూడాల్సి ఉందన్నారు. 2029నాటికి ఆంధ్రప్రదేశ్ ను ఇన్నొవేషన్ ఆధారిత రాష్ట్రంగా మార్చాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ రంగంలో 20వేలకు పైగా స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాలు, 10 ప్రధాన రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఇది కేవలం స్టార్టప్ ల సంఖ్య గురించి మాత్రమే కాదని, విద్యార్థులు, ఎంఎస్ఎంఇలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వంతో సహా అందరిలోనూ ఇన్నోవేషన్ మైండ్ సెట్ కల్పించే తమ ప్రధాన ధ్యేయమని లోకేష్ వివరించారు.