News10th Jul 04:43 PMSunil Byrisetty1 min read
స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజతం
ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం దక్కింది. విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్య వెండి పతకం సాధించింది. ఈ నేపథ్యంలో అమరావతి సచి
ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం దక్కింది. విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్య వెండి పతకం సాధించింది. ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయంలో రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్‌లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకోవడాన్ని అభినందించారు.